జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా అశోక్

Thu,September 12, 2019 12:18 AM

మామిళ్లగూడెం, సెప్టెంబర్ 11: జిల్లా ఇన్‌చార్జి గిరిజన సంక్షేమాధికారిగా అశోక్‌ను నియమిస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్థుతం సహాయ గిరిజన సంక్షేమాధికారిగా పని చేస్తున్న అశోక్‌కు ఇన్‌చార్జిగా నియామకం చేశారు. ఇప్పటి వరకు జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా పనిచేసిన మాలోత్ సైదాను కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఐటీడీఏ పీవో, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు సరెండర్ చేశారు. దీంతో ఖాళీ ఏర్పడిన స్థానంలో అశోక్‌ను నియామకం చేసినట్లు శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. గిరిజన సంక్షేమ శాఖలో ఇటీవల మాలోత్ సైదా వ్యవహరశైలీ, అవినీతి ఆరోపణలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తాయి. దీంతో కలెక్టర్ సరెండర్ నిర్ణయం తీసుకున్నారు. ఇన్‌చార్జి జిల్లా గిరిజన సంక్షేమాధికారిగా నియామకం పొందిన అశోక్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని గిరిజన వసతి గృహ సంక్షేమాధికారులు, కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

187
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles