‘మన ధాన్యం - మన విత్తనం’ ప్రారంభం

Tue,November 19, 2019 03:21 AM

జగిత్యాల రూరల్‌: జగిత్యాల మండలంలోని లక్ష్మీపూర్‌ రైతు పరస్పర సహకార సంఘం ఆధ్వర్యం లో ‘మన ధాన్యం-మన విత్తనం’ కార్యక్రమంలో భాగంగా రైతులు రూపొందించిన జేజీఎల్‌ 24423 అనే రకం విత్తనాల బ్యాగులను పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీపూర్‌ ఫార్మర్స్‌, ప్రొడ్యూసర్స్‌ ఆధ్వర్యంలో వరి విత్తనాలను త యారు చేయడం అభినందనీయమన్నారు. గ్రామానికి చెందిన రైతులు సొసైటీగా ఏర్పడి లక్ష్మీపూర్‌ రైస్‌, లక్ష్మీపూర్‌ సీడ్స్‌, పలు రకాలైన ఉత్పత్తులను తయారు చేయడం గొప్ప విషయమన్నారు. లక్ష్మీ పూర్‌ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తుంద న్నారు. అనంతరం రైతులకు విత్తనాల బ్యాగుల ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ చెరుకు జాన్‌, ఏడీ సురేశ్‌ కుమార్‌, ఏవో తిరుపతి నాయక్‌, సొసైటీ చైర్మన్‌ పన్నాల తిరుపతి రెడ్డి, డైరెక్టర్‌ ఎన్‌ రాజేవ్వర్‌ రెడ్డి, జీ గంగయ్య, ఎస్‌ తిరుపతి రెడ్డి, ఎస్‌ జీవన్‌రెడ్డి, పాల్గొన్నారు.

107
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles