నేడు లక్ష దీపోత్సవం..

Sun,November 17, 2019 01:58 AM

కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండలంలోని నగునూర్ పరివార సమేత శ్రీ దర్గాభవానీ ఆలయం ఆదివారం నిర్వహించే కార్తీకమాస ప్రయుక్త లక్ష దీపోత్స వానికి ముస్తామైంది. శనివారం దుర్గాభవానీ సేవాదల్, గోవిందాపతి సేవా సమితి సభ్యులు ఆలయ ప్రాంగాణాన్ని రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దారు. ప్రమిదలను వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేశారు. ఆలయాన్ని పూలతో అలంకరించారు. రంగురంగుల విద్యుద్దీపాలు అమర్చి, బారికేడ్లను ఏర్పాటు చేశారు. అలాగే, దీపోత్సవంలో పాల్గొనే భక్తుల కోసం ఆలయ కమిటీ కరీంనగర్ పాత బజారు శివాలయం నుంచి మంచిర్యాల చౌరస్తా మీదుగా ఆలయ ప్రాంగణం వరకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేసింది. వేద పండితుడు పురాణం మహేశ్వరశర్మ ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి ప్రారంభమయ్యే లక్షదీపోత్సవంలో భాగంగా అమ్మవారు హరిహరుల అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ కమిటీ పేర్కొంది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని, అమ్మవారి కృపకు పాత్రులుకావాలని ఆలయకమిటీ బాధ్యులు వంగల లక్ష్మణ్, వేములవాడ ద్రోణాచారి, తదితరులు కోరారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles