తాసిల్‌లో నిఘా నేత్రాలు

Sat,November 16, 2019 03:33 AM

హుజూరాబాద్, నమస్తే తెలంగాణ: తాసిల్దార్ విజయారెడ్డి హత్య ఉదంతం నేపథ్యంలో అధికారుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన ప్రభుత్వం తాసిల్ కార్యాలయాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. మున్ముందు ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపడుతున్నది. నిత్యం వందల మంది వివిధ పనులపై తాసిల్ కార్యాలయాలకు వచ్చిపోతుండగా.. చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై ఆర్డీవో రెండు రోజులక్రితం తాసిల్దార్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యాలయాల్లో ఏర్పాటుకు సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ పరికరాలు ఎన్ని అవసరం పడుతాయో వెంటనే ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. ఈ మేరకు తాసిల్దార్లు నిపుణులతో చర్చించి ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ఇకపై తాసిల్ కార్యాలయంలో ఏ మూల ఏం జరిగినా కెమెరాల్లో నిక్షిప్తం కానున్నది. అధికారులను బెదిరించే ప్రయత్నాలు చేసే వారు ఇట్టే దొరికిపోయి జైలు పాలుకాక తప్పదు.

68
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles