ఉప్పొంగిన కాళేశ్వర గంగ

Wed,November 13, 2019 02:36 AM

రామడుగు/ధర్మారం/బోయినపల్లి : కాళేశ్వరం లింక్‌-2లో రెండో దఫా గోదారి జలాల తరలింపు ప్రక్రియను మంగళవారం చేపట్టారు. ఈఈ నూనె శ్రీధర్‌ పర్యవేక్షణలో ఆరో ప్యాకేజీ ధర్మారం మండలం నంది పంప్‌హౌస్‌ నుంచి ఎనిమిదో ప్యాకేజీ రామడుగు మండలం గాయత్రీ పంప్‌హౌస్‌ మీదుగా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద ఉ న్న శ్రీరాజరాజేశ్వర (మిడ్‌ మానేరు) రిజర్వాయర్‌కు నీటిని తరలించారు. ముందుగా తెల్లవారుజామున 5.30 గంటల నుంచి నంది పంప్‌హౌస్‌లో 3, 4, 5 మోటర్లను నడిపించారు. మధ్యాహ్నం 3 గంటలకు రెండో మోటర్‌ను ఆన్‌ చేశారు. ఒక్కో మోటర్‌ నుంచి 3,150 క్యూసెక్కుల చొ ప్పున ఈ నాలుగు మోటర్ల ద్వారా 12,600 క్యూసెక్కులను ఏడో ప్యాకేజీ నంది రిజర్వాయర్‌కు తరలించారు. అ క్కడి రిజర్వాయర్‌ 10 హెడ్‌ రెగ్యులేటర్‌ గేట్ల నుంచి నీటిని వదిలారు. అంతకు ముందే గాయత్రీ పంప్‌హౌస్‌ సర్జ్‌ఫూల్‌ను 224.5 మీటర్ల వరకు నీటితో నింపగా, ఉదయం 5 గంటలకు ఒకదాని వెంట ఒకటి వరుసగా 1, 2, 3, 4 బా హుబలి మోటర్లను ఆన్‌చేశారు. దీంతో కాళేశ్వరజలాలు 115 మీటర్ల లోతు నుంచి నాలుగు పంపుల ద్వారా డెలివరీ సిస్టర్న్‌ నుంచి ఉప్పొంగాయి. గ్రావిటీ కాలులోకి ఎగిసి పడి, అక్కడి నుంచి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో శ్రీరాములపల్లి వద్ద ఉన్న జంక్షన్‌పాయింట్‌కు చేరుకున్నా యి. అక్కడి నుంచి వరదకాలువ ద్వారా శ్రీరాజరాజేశ్వర (మిడ్‌ మానేరు) రిజర్వాయర్‌కు పరుగులు తీశాయి.

ఈ సందర్భంగా భూగర్భంలోని కంట్రోల్‌రూమ్‌తోపాటు డెలివరీ సిస్టర్న్‌ వద్ద జలాలను ఈఈ నూనె శ్రీధర్‌ ప్రాజెక్టు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం జంక్షన్‌పాయిం ట్‌, షానగర్‌ శివారులో వరదకాలువ 102 కిలోమీటర్‌ వద్ద ఏర్పాటు చేసిన హెడ్‌రెగ్యులేటర్‌కు వద్ద పరిశీలించారు. గా యత్రీ పంపుహౌస్‌ నుంచి ఒక్కో మోటర్‌ 3,150 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నదనీ, నాలుగు మోటర్ల ద్వారా సు మారు 12,600 క్యూసెక్కుల నీరు వరదకాలువలో కలుస్తుందని చెప్పారు. మరోవైపు ఎస్సార్‌ఎస్పీ ద్వారా 3,500 క్యూసెక్కుల నీరు వస్తున్నదనీ, మొత్తం రోజుకు 1.5 టీఎంసీల నీరు శ్రీరాజరాజేశ్వర జలాశయానికి చేరుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు అవసరాన్ని బట్టి మరిన్ని మోటర్లను ప్రారంభించి నీటిని తరలిస్తామని చెప్పారు. శ్రీ రాజరాజేశ్వర రిజర్వాయర్‌కు మంగళవారం సాయంత్రం 6గంటల వరకు 13,942 క్యూసెక్కుల నీరు చేరినట్లు ఎస్‌ఆర్‌ఆర్‌ జలాశయం ఈఈ అశోక్‌కుమార్‌ చెప్పారు. కరీంనగర్‌లోని లోయర్‌ మానేరు డ్యాంకు రివర్స్‌ స్లూయిస్‌ గేట్ల ద్వారా వెళ్లే నీటిని నిలిపివేసినట్లు తెలిపారు. నంది పంప్‌హౌస్‌లో ఏఏఈలు ఉపేందర్‌, కే శ్రీనివాస్‌ మోటార్ల రన్‌ను పర్యవేక్షించారు.

నేడు గాయత్రీ పంపుహౌస్‌ వద్ద గోదారి హారతి
లక్ష్మీపూర్‌లోని గాయత్రి పంపుహౌస్‌ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ ఆధ్వర్యంలో గోదావరి హారతి నిర్వహిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్‌ కృషితో నియోజకవర్గంలోని అన్ని మండలాల చెరువులు, కుంటలను కాళేశ్వరం జలాలతో నింపుకున్నామనీ, ఆ సంతోషాన్ని వేడుకలా చేసుకునేందుకే వేడుక నిర్వహిస్తున్నామని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు తరలిరావాలని కోరారు.

సీఎం సంకల్పబలం గొప్పది
రాష్ట్ర ప్రజలకు త్వరితగతిన గోదారి జలాలు అందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంకల్పబలం గొప్పదనీ, ఆయన కృషితోనే మూడేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కొనియాడారు. రామడుగు మండలం లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌస్‌ను మంగళవారం మధ్యాహ్నం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గతంలో చొప్పదండి నియోజకవర్గం కనీసం తాగునీరు లభించక కరువుకు నిలయంగా ఉండేదని ఆవేదన చెందారు. ఎప్పుడు కరువు మండలాలను ప్రకటించినా చొప్పదండి నియోజకవర్గంలో రామడుగు, గంగాధర, బోయినపల్లి, కొడిమ్యాల, మల్యాల మండలాలు ముందు వరుసలో ఉండేవని గుర్తు చేశారు. అలాంటి ప్రాంతానికి గోదారి జలాలను తెచ్చి సస్యశ్యామలం చేసిన గొప్పవ్యక్తి సీఎం కేసీఆర్‌ అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 8వ ప్యాకేజీలో ప్రపంచ సాగునీటి రంగంలోనే భారీ పంపులైన బాహుబలి మోటార్లను ఏర్పాటు చేసి రామడుగు మండలం లక్ష్మీపూర్‌ను చరిత్రలో నీలిచేలా చేసిన కేసీఆర్‌ గొప్పతనం మరువరానిదన్నారు. సుమారు 600 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జలాలను ఎత్తిపోస్తూ నీరందించడం అపరభగీరథుడు సీఎం కేసీఆర్‌కే సాధ్యమైందన్నారు. గతంలో వరదకాలువ జీవనదిలా ఉండబోతోందని చెబితే ప్రతిపక్షాలు అపహాస్యం చేశాయనీ, నేడు ఎస్సార్‌ఎస్పీ పునర్జీవ పథకం ద్వారా వరదకాలువ జీవనదిగా మారిందని తెలిపారు. చొప్పదండి నియోజకవర్గంలో గాయత్రీ పంపుహౌస్‌ ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ మార్కొండ కిష్టారెడ్డి, సర్పంచులు జవ్వాజి శేఖర్‌, బండ అజయ్‌రెడ్డి, ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్‌గౌడ్‌, గంగాధర ఏఎంసీ వైస్‌ చైర్మన్‌ సురేశ్‌, నాయకులు పూడూరి మల్లేశం, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్‌, జంకె రాంచందార్రెడ్డి, చిలుముల ప్రభాకర్‌, కనుకం నుకయ్య, జుట్టు లచ్చయ్య, ప్రాజెక్టు ఏఈఈలు శ్రీనివాస్‌, సురేశ్‌, రమేశ్‌, నాయక్‌, వెంకటేష్‌, తదితరులు ఉన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles