గాయత్రీ పంపుహౌస్‌లో నేడు మరో అద్భుత ఘట్టం

Tue,November 12, 2019 03:40 AM

-ఒకేసారి నడవనున్న ఏడు బాహుబలి పంపులు
-సమాయత్తమవుతున్న ప్రాజెక్టు అధికారులు
-ఉదయం 5నుంచి 10 గంటల మధ్యలో నిర్వహించే అవకాశం

రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కేవలం మూడేళ్లలోనే పూర్తి చేసి, ప్రజలకు అంకితం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో అద్భుతం ఆవిష్కృతం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్ష్మీపూర్ గాయత్రీ పంపుహౌస్‌లో సోమవారం ఒకేసారి ఏడు బాహుబలి మోటర్లను ప్రారంభించనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో సుమారు 50 లక్షల ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టును అట్టహాసంగా ప్రారంభించారు. గత ఆగస్టు నుంచి మొదలు అక్టోబర్ వరకు ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, లిఫ్ట్ అడ్వైజర్ పెంటారెడ్డి సమిష్ఠిగా కృషిచేసి, విడుతల వారీగా మోటర్లను ప్రారంభించారు. ఎనిమిదో ప్యాకేజీలో మొత్తం ఏడు మోటర్లను ఏర్పాటు చేశారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించిన గాయత్రీ పంపుహౌస్‌లో అన్ని మోటర్లకు విజయంవంతంగా వెట్ ట్రయల్న్ నిర్వహించారు. కాగా, మంగళవారం ఒకేసారి ఏడు మోటర్లను ప్రారంభించి కాళేశ్వరం జలాలను ఎత్తిపోస్తూ మధ్యమానేరుకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉదయం ఐదు గంటల నుంచి పది గంటలలోపు ఎప్పుడైనా మోటర్లను రన్ చేయవచ్చునని అధికారులు తెలిపారు.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles