నా కొడుకును బతికించండి..

Mon,November 11, 2019 02:03 AM

చొప్పదండి,నమస్తేతెలంగాణ: చొప్పదండి పట్టణానికి చెందిన పిట్టల రాజుకుమార్ (27) అనే యు వకుడు కాలేయ, ఊపిరితిత్తుల సంబంధ వ్యా ధులతో బాధపడుతూ హైదరా బాద్‌లోని ప్రైవేట్ వైద్యశాలలో చికిత్సపొందుతూ ఆపన్నహస్తం కో సం ఎదురుచూ స్తున్నాడు. నెల రోజుల క్రితం వరకు తన తోటి స్నేహితులతో, కుటుంబసభ్యులతో ఆరోగ్యంగా ఉంటూ చలాకిగా కనిపించిన రాజు ఒకేసారి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబసభ్యులు కరీంనగర్ వైద్యశాలలో పరీక్షలు చే యించారు. కాలేయ, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నాయనీ, మెరుగైన చికిత్సకు హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. నిరుపేద కుటుంబానికి చెంది న రాజు చికిత్సకోసం తల్లిదండ్రులు ఇప్పటికే రూ.13లక్షలు ఖర్చు చేయగా, మిగితా సర్జరీలకొరకు మరో రూ.5 లక్షల కు పైగా ఖర్చు అవుతందని వైద్యులు తెలిపారపీ, పేద కుటుంబానికి చెం దిన తమ కొడుకు చికిత్సకు ప్రభుత్వం, దాతలు ఆర్థిక సహాయం చేసి ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు. ఆర్థిక సహాయం చేసే వారు 9502192221 నంబర్‌లో సంప్రదించాలని వేడుకుంటున్నారు.

81
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles