ఆధునీకరణ పనులు భేష్

Mon,November 11, 2019 02:03 AM

కరీంనగర్ క్రైం: జిల్లా ట్రెజరీ కార్యాలయం ఆధునీకరణ పనులు బాగున్నాయని పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ అన్నారు. ఆదివారం పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టరేట్‌లోని ట్రెజరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో రూ.25 కోట్లతో కొత్తగా పోలీస్ కార్యాలయ భవనాల నిర్మాణాలు, ట్రెజరీ ఆఫీసుల ఆధునీకరణ, ఇతర శాఖల పనులు పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా చేస్తున్నట్లు వెల్లడించారు. లక్ష రూపాయల పనులను కూడా ఆన్‌లైన్ టెండర్ల ద్వారానే చేపడుతున్నామని తెలిపారు. జిల్లా ట్రెజరీ ఆఫీసుల ఆధునీకరణకు రూ.28 లక్షలు, సబ్ ట్రెజరీ ఆఫీసుల ఆధునీకరణకు రూ.14 లక్షల చొప్పున ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయం ఆధునీకరణ పనులు పూర్తయ్యాయనీ, ఫర్నిచర్ ఈ నెలలో సమకూర్చుతామని చెప్పారు.

డిసెంబర్ మొదటి వారంలో మంత్రుల చేతుల మీదుగా కార్యాలయాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పటిష్టంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యం అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖను బలోపేతం చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా రూ.375 కోట్లతో కొత్త వాహనాలను కొనుగోలు చేశారని తెలిపారు. దేశంలోనే 17.7 శాతం జీడీపీతో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలవడం గర్వకారణమన్నారు. బంగారు తెలంగాణ సాధనకు ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ట్రెజరీ అధికారి కార్యాలయం ఉప సంచాలకుడు శ్రీనివాస్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అగ్నిమాపక కేంద్రం పనుల పరిశీలన
మానకొండూర్: మండల కేంద్రంలో అగ్నిమాపక కేంద్ర భవనం నిర్మాణ పనులను ఆదివారం పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ. 87లక్షల 50 వేల వ్యయంతో నిర్మాణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించి ఏడాదిలోగా పూర్తిచేయాలని సదరు గుత్తేదారును ఆదేశించారు. ఆయన వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఈఈ టీ శ్రీనివాస్, ఏఈ రాజశేఖర్, మానకొండూర్ సీఐ సంతోష్‌కుమార్,అగ్నిమాపక కేంద్రం లీడింగ్ ఫైర్‌మెన్ బీ గోపాల్‌రెడ్డి, కాంట్రాక్టర్ సుదర్శన్ తదితరులు ఉన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles