త్రికూటాలయంలో ప్రత్యేక పూజలు

Mon,November 11, 2019 02:02 AM

మల్లాపూర్: మండలంలోని వాల్గొండ గ్రామంలోని గోదావరి నదీ తీరానగల ప్రాచీన శ్రీరామలింగేశ్వరస్వామి త్రికూటాలయంలో ఆదివారం కార్తీకమాస వేడుకల్లో భాగంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సుప్రభాత సేవ, వసంతోత్సవం, పత్రిపూజ, తులసీకల్యాణం, హోమం తదితర పూజలు చేశారు. అనంతరం కుంకుమపూజ నిర్వహించగా మహిళలు అధికసంఖ్యలో పాల్గొన్నారు. సోమవారం ఆలయ ఆవరణలో నిర్వహించనున్న లక్షదీపోత్సవానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు దండిక గంగు, ధర్మసోత్ కళావతి, మాజీ సర్పంచ్ చిలివేరి లక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు క్యాతం సుజాత, ఆలయకమిటీ చైర్మన్ సాంబారి శంకర్, అధికసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

80
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles