ఎస్సారెస్పీ ఉప కాలువలో ట్రాక్టర్ బోల్తా

Sun,November 10, 2019 01:09 AM

శంకరపట్నం: మండలంలోని మొలంగూర్ శివారులో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ఎస్సారెస్పీ ఉప కాలువలో బోల్తా పడింది. అయితే పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మొలంగూర్‌లోని నల్లవెంకయ్యపల్లెకు చెందిన మేడుదుల మల్లయ్య అనే వ్యక్తి తన సొంత ట్రాక్టర్ నడుపుకుంటున్నాడు. శనివారం వ్యవసాయ పనుల్లో భాగంగా పొలం వైపు బయలుదేరాడు. మొలంగూర్ శివారులోని పోశమ్మ గుడి వద్దకు రాగానే ట్రాక్టర్ అదుపు తప్పి పక్కనే గల ఎస్సారెస్పీ ఉప కాలువలో పడిపోయింది. అయితే ట్రాక్టర్ నడుపుతున్న మల్లయ్య దూరంగా పడడంతో ప్రాణాపాయం తప్పినట్లయింది. చుట్టుపక్కల వారు చూసి వెంటనే అతడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించి ఇంటికి తీసుకువచ్చారు.

101
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles