ఘనంగా ప్రమాణస్వీకారోత్సవం

Sat,November 9, 2019 04:34 AM

కరీంనగర్ రూరల్: రాజ్‌బహద్దూర్ వెంటకరామారెడ్డి సంక్షేమ సంఘం నూతన పాలకవర్గ ప్రమా ణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. శుక్రవారం సీతారాంపూర్‌లోని ఆర్‌బీవీఆర్‌ఆర్ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు డాక్టర్ వీ భూంరెడ్డి, గౌరవ అధ్యక్షుడు ఎడవెల్లి విజేందర్‌రెడ్డి, ఆర్‌బీవీఆర్‌ఆర్ రెడ్డి హాస్టల్ హైదరాబాద్ అధ్యక్షుడు కొండ లక్ష్మీకాంతరెడ్డి, ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ వావిలాల హన్మంతరెడ్డి పాల్గొని అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. పాలకవర్గ సభ్యులకు అందుబాటులో ఉండి అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని ప్రకటించారు. అనంతరం ఎన్నికల అధికారి నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఆర్‌బీవీఆర్‌ఆర్ రెడ్డి సంక్షేమ సంఘ నూతన అధ్యక్షుడిగా మూల ప్రభాకర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పింగిళి రవీందర్‌రెడ్డి, ఉపాధ్యక్షులుగా కూర మహిపాల్‌రెడ్డి, చాడ రవీందర్‌రెడ్డి, పెండ్యాల రాంరెడ్డి, కోశాధికారిగా బారాజు కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా కసిరెడ్డి రాణిరెడ్డి, దాసరి రాంరెడ్డి, గోగూరి శైలేందర్‌రెడ్డి (బాపురెడ్డి), కార్యవర్గసభ్యులుగా కంకణాల సరోజన, దనియకుల శ్రీనివాస్‌రెడ్డి, చింతల శ్రీనివాస్ రెడ్డి, ఎం నారాయణరెడ్డి, కే జయారెడ్డి, పీ సంగీతారెడ్డిలు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో మైత్రి ఛానల్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి, మాజీ అధ్యక్షుడు డాక్టర్ భాగ్యారెడ్డి, జాతీయ అవార్డు గ్రహీత అంజనారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ జ్యోతిరెడ్డి, వడియాల యశ్వంత్‌రెడ్డి, పెండ్యాల కేశవరెడ్డి, డాక్డర్ బండ వెంకట రెడ్డి, కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles