అనుమతి లేని క్లినిక్‌పై దాడి

Fri,November 8, 2019 01:26 AM

కరీంనగర్ హెల్త్: నగరంలోని జ్యోతినగర్‌లో అనుమతి లేకుండా నడిపిస్తున్న శ్రీసాయి క్లీనిక్‌పై గురువారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. స్థానికుల సమాచారం మేరకు క్లినిక్ నిర్వాహకురాలు డాక్టర్ రాధ అబార్షన్ చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో దాడులు చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రాంమనోహర్‌రావు తెలిపారు. ఆయనతో పాటు తాసీల్దార్ కనుకయ్య, టూటౌన్ ఎస్‌ఐ స్వరూప్‌రాజ్, విద్యానగర్ అర్బన్ హెల్త్ సెంటర్ మెడికల్ అధికారి శరణ్య, సిబ్బంది క్లినిక్‌కు వెళ్లారు. అప్పటికే నిర్వాహకురాలితో పాటు సిబ్బంది క్ల్లినిక్‌కు తాళం వేసి పరారైనట్లు జిల్లా వైద్యాధికారి తెలిపారు. అబార్షన్ చేసే సామగ్రితో పాటు ఇంజక్షన్లు, మందులు, స్లైన్ బాటిళ్లు సీజ్ చేసినట్లు తెలిపారు. వీటితో పాటు గురువారం ఉదయం అబార్షన్ చేసిన రక్తంతో కూడిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మరో గది తాళం పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా పరుపు కింద దాచి ఉన్న రూ. 66,400 నగదు, రూ. 2 లక్షలు విలువ చేసే రెండు ప్రామీసరి నోట్లు, మూడు మొబైల్ ఫోన్లు, పుస్తెల తాడు, పాస్‌పోర్టు, ఒక పెన్ డ్రైవ్, మెమోరీ కార్డు, ఆర్సీ, ఓటరు గుర్తింపు కార్డులను స్వాధీనం చేసుకొని, క్లినిక్‌ను సీజ్ చేశారు. రాధకు ఎలాంటి విద్యార్హతలు లేకున్నా డాక్టర్ రాధ అని పేరు పెట్టుకోవడం చట్టరీత్యా నేరమనీ, కేసు నమోదు చేయనున్నట్లు వెల్లడించారు.

85
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles