ఫీజు డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందే: జిల్లా ఫోరం తీర్పు

Mon,October 21, 2019 01:15 AM

కరీంనగర్ లీగల్: ప్రవేశం రద్దు చేసుకున్న ఓ విద్యార్థినికి ఫీజు డబ్బులు తిరిగి ఇవ్వని ఓ ప్రైవేట్ కళాశాలకు వ్యతిరేకంగా జిల్లా ఫోరం తీర్పునిచ్చింది. కరీంనగర్ పట్టణంలోని కాపువాడకు చెందిన కోల సంపత్‌రెడ్డి తన కుమార్తె మలైకాను రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ సమీపంలోని ఎక్సలెన్‌షియా జూనియర్ కళాశాలలో 2016 జూన్‌లో చేర్పించి మొదటి సంవత్సరం రూ.95వేలు ఫీజు చెల్లించారు. రెండు నెలలు కళాశాలలో ఉన్న విద్యార్థిని తదుపరి అడ్మిషన్ విరమించుకున్నది. డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా కళాశాల యాజమాన్యం రూ.20వేలు మాత్రమే చెల్లించింది. దీనిపై సంపత్‌రెడ్డి జిల్లా ఫోరంలో ఫిర్యాదు చేశారు. విద్యార్థులను చేర్చుకునే గడువు ముగిసిందనీ, మరో విద్యార్థిని చేర్చుకోవడం సాధ్యం కాదనీ, అందుకే డబ్బులు తిరిగి చెల్లించలేమని కళాశాల యాజమాన్యం ఫోరానికి తెలిపింది. ఇరువర్గాల వాదనలు విని, సాక్ష్యాధారాలు పరిశీలించిన ఫోరం జిల్లా అధ్యక్షురాలు స్వరూప, సభ్యులు ప్రవీణ్‌కుమార్, విద్యార్థిని కళాశాలలో ఉన్న కాలానికి డబ్బులు మినహాయించుకొని, మిగతా ఫీజుతోపాటు నష్ట పరిహారంగా రూ.10వేలు, ఫిర్యాదు ఖర్చులకు రూ.5వేలు వెంటనే యాజమాన్యం చెల్లించాలని తీర్పు వెలువరించారు.

73
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles