ఆడబిడ్డలకు సర్కారు అండ

Sun,October 20, 2019 04:32 AM

చొప్పదండి, నమస్తేతెలంగాణ: ప్రతి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందనీ, ఆ దిశగా మహిళల అభివృద్ధికి పథకాలు అమలు చేస్తున్నామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకెరవిశంకర్ పేర్కొన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మండలంలోని ఐదుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను శనివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిరుపేదల కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిల్లకు కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా డబ్బులు అందజేస్తూ వారికి బాసటగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, ఎంపీపీ చిలుకరవి, సర్పంచ్ లావణ్య, కోఆప్షన్ పాషా, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు బందారపు అజయ్, నాయకులు గడ్డం చుక్కారెడ్డి, నలుమాచు రామక్రిష్ణ, మాచర్ల వినయ్, వెల్మ శ్రీనివాస్‌రెడ్డి, ఆరెల్లి చంద్రశేఖర్‌గౌడ్, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్, ఛత్రపతి, ఏనుగు స్వామిరెడ్డి, గాండ్ల లక్ష్మణ్, తోట శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.

63
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles