వర్షం.. నష్టం

Sat,October 19, 2019 02:03 AM

జిల్లాలో గురువారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జిల్లాలో 4,627.32 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో అత్యధికంగా 119 గ్రామాల్లోని 6,298 మంది రైతులకు చెందిన 4,619.24 హెక్టార్లలో వరి పంట, 15 మందికి చెందిన 8.8 హెక్టార్లలో మక్కజొన్న పంట దెబ్బతిన్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. కరీంనగర్ రూరల్ మండలంలో గురువారం రాత్రి 5.5 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ మండలంలో 2.4 హెక్టార్లలో వరి, 0.8 హెక్టార్లలో మక్కజొన్న పంట దెబ్బతిన్నది. కొత్తపల్లిలో 9.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ మండలంలో 15 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. తిమ్మాపూర్ మండలంలో 28.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. 262 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నది. చిగురుమామిడి మండలంలో 15.6 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 91 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నది.

మానకొండూర్‌లో 16.0 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 1,357 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. శంకరపట్నంలో 33.3 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 611 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. హుజూరాబాద్‌లో 48.0 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 229 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. జమ్మికుంటలో 43.3 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 336 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. ఇల్లందకుంటలో 61.0 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 276 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. వీణవంకలో 32.3 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 1,026.12 హెక్టార్లలో వరి దెబ్బతిన్నది. సైదాపూర్‌లో 63.7 మిల్లీ మీటర్ల వర్షం కురియగా 343 హెక్టార్లలో వరి, 8 హెక్టార్లలో మక్కజొన్న పంట దెబ్బతిన్నది.

నేల కొరిగిన వరి..
జిల్లాలో 15 రూరల్ మండలాలు ఉండగా 11 మండలాల్లో వర్షం ప్రభావం చూపింది. గంగాదర, రామడుగు, చొప్పదండి మండలాలు మినహా అన్ని మండలాల్లో వరి పంట దెబ్బతిన్నది. మొత్తం 119 గ్రామాల్లోని 6,313 మంది రైతులకు చెందిన పంటలు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. మానకొండూర్, వీణవంక, శంకరపట్నం, సైదాపూర్, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజూరాబాద్, తిమ్మాపూర్ మండలాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. అయితే కొన్ని గ్రామాల్లో చేతికి వచ్చిన వరి నేల రాలగా చాలా మండలాల్లో పొట్ట దశలో ఉన్న వరికి నేలకొరిగింది. అయితే చాలా వరకు పాక్షికంగానే దెబ్బతిని ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం పొట్ట, చిరుపొట్ట దశలో ఉన్న పంటలకు నష్టం ఎక్కువగా ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ దశలో ఉన్న వరి నేలకొరిగితే వర్షాలు తగ్గగానే తిరిగి యథాస్థితికి చేరుకుంటుందని అంటున్నారు. అయితే 33 శాతం పంట దెబ్బతిన్న రైతుల్లో ఎవరైనా బీమా ప్రీమియం చెల్లినట్లయితే వెంటనే ఇఫ్కోటోక్యో కంపెనీకి ప్రతినిధులకు ఫోన్ చేసి వివరాలు అందిచాలని జిల్లా అధికారులు రైతులకు సూచిస్తున్నారు. 33 శాతం పంట నష్టం దాటిన రైతులు 9966742880, 984022446 నంబర్లకు ఫోన్ చేసి వివరాలు అందించాలని, బ్యాంకుల్లో రుణాలు తీసుకున్న రైతులు నష్టపోయినట్లయిత వెంటనే ఈ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ కోరారు. వరి పంట నేలకొరిగా రైతులు వర్షం తగ్గగానే నీటిని బయటికి వదలాలని ఆయన తెలిపారు..

84
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles