వేములవాడ రాజన్న సన్నిధిలో

Fri,October 18, 2019 01:31 AM

-ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి పూజలు
వేములవాడ కల్చరల్: వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామివారిని గురువారం ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి వీ చక్రధర్‌రావ్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రధానార్చకుడు నమిలకొండ ఉమేశ్ ఆధ్వర్యంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయంలోని నాగిరెడ్డిమండపంలో ఆయనకు అర్చకులు వేదమంత్రోచ్ఛరణలతో ఆశీర్వచనం చేసి, స్వామివారి శాలువాతో సత్కరించారు. ప్రసాదాన్ని అందజేశారు. వీరి వెంట ఆలయ అధికారులు, తదితరులున్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles