భూ సమస్యలపై జాప్యం వద్దు

Fri,October 18, 2019 01:31 AM

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ : మండలంలో రైతులకు సంబంధించి భూ సమస్యల పరిష్కారంపై జాప్యం చేయవద్దని జాయింట్ కలెక్టర్ జీవీ శ్యాం ప్రసాద్‌లాల్ అన్నారు. గురువారం తాసిల్దార్ కార్యాలయాన్ని జేసీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూ రికార్డులు, ఆన్‌లైన్ నమోదు, గ్రామాల వారీగా నివేదికలను పరిశీలించారు. రికార్డులను పరిశీలించి పెండింగ్‌లో ఉన్న సర్వే నంబర్లను ఎందుకు పూర్తి చేయడం లేదని వీఆర్వోల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ సమస్యలపై రైతులు ఫి ర్యాదు చేస్తే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ అర్హులందరికి పాసు పుస్తకా లు అందేలా రెవెన్యూ సిబ్బంది తగిన చర్యలు తీ సుకోవాలని సూచించారు. వివాదస్పదమైన భూ ములు మినహా సక్రమంగా ఉన్న భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు.

మోఖాపై ఉన్న రైతుల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు. రైతులు తమ సమస్యలపై దళారులు, కిందిస్థాయి సిబ్బందిని ఆశ్రయించవద్దని, నేరుగా తాసిల్దార్, ఉన్నతాధికారులను కలిసి సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. రైతుబాట కార్యక్రమంలో భాగంగా రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సిబ్బంది ఇంటింటా తిరిగి సమస్యలను పరిష్కరించారని తెలిపారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూ ములను గుర్తించి స్వాధీనం చేసుకోవాలన్నారు. అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల కోసం ప్రభుత్వ భూములను గుర్తించాలని, గుర్తించిన చోట రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని తెలిపారు. ప్రతి గ్రామంలో వైకుంఠధామాలు, డంపింగ్ యార్డుల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ్ద తీసుకుంటున్నారని చెప్పారు. తాసిల్దార్ పురం యుగంధర్, నాయబ్ తాసిల్దార్ రమేశ్, ఆర్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.

72
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles