ఎన్టీపీసీలో బ్యాట్‌మింటన్ పోటీలు

Fri,October 18, 2019 01:31 AM

జ్యోతినగర్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో గురువారం ఎన్టీపీసీ టౌన్‌షిప్‌లోని స్పందన క్లబ్‌లో జిల్లా స్థాయి బ్యాట్‌మింటన్(షటిల్) పోటీలు నిర్వహించారు. అండర్-14, 17 విభాగాల బాలబాలికలకు నిర్వహించిన పోటీల్లో జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల నుంచి 150 మంది క్రీడా విద్యార్థులు పోటీలకు హాజరయ్యారు. బాలికల విభాగంలో అండర్-14లో కె నిషిత, ఎం అనుష, కె జోషిత, పి బింధుశ్రీ, సీహెచ్ నాగలక్ష్మి, సీహెచ్ అక్షయ గెలుపొందగా, అండర్-17లో బీఎస్‌డీ పల్లవి, వి నిహారిక, అఫ్రిన్, పి సాయిశ్రీ, ఫాతిమా, జి అక్షయ విజేతలుగా నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులు కరీంనగర్‌లో జరుగు ఉమ్మడి కరీంనగర్ ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారు. పోటీలకు పెద్దపల్లి జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి బాబు శ్రీనివాస్, ఎన్టీపీసీ సీనియర్ మేనేజర్ కె సత్యనారాయణ, పోచన్న అతిథులుగా పాల్గొనగా, రామగుండం జోన్ కార్యదర్శి కొమురోజు శ్రీనివాస్, పీడీలు పి శ్రీనివాస్, విజయ్‌కుమార్, సుదేష్ కుమార్, కిశోర్‌సింగ్, రాజ్‌నాయక్, కృష్ణమూర్తి, సత్యం ఉన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles