సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Fri,October 18, 2019 01:30 AM

కొడిమ్యాల: మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట సీఎం కేసీఆర్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటాలకు గ్రామ పంచాయతీ కార్మికులు, టీఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు గురువారం పాలాభిషేకం చేశారు. ఎంపీపీ మెన్నేని స్వర్ణలత మాట్లాడుతూ, టీఆర్‌ఎస్ ప్రభుత్వం కార్మికుల పనులను గుర్తించి రూ.8,500కు వేతనం పెంచినట్లు తెలిపారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ పంచాయతీ కార్మికులు జీవో కాపీని ఎంపీడీవోకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పర్లపెల్లి ప్రసాద్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు, టీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు రాఘవరెడ్డి, ఆయా గ్రామాల ఎంపీటీసీ సభ్యులు మల్లారెడ్డి, మిరియ, మహేశ్, ఆయా గ్రామాల సర్పంచులు మల్లేశం, బొజ్జానాయక్, మల్లేశం, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మెన్నేని రాజనర్సింగారావు, నాయకులు పులి వెంకటేశ్, నేరెళ్ల మహేశ్, బొడ్డు రమేశ్, చీకట్ల మహేందర్, మ్యాకల మల్లేశం, గంగుల మల్లేశ్‌యాదవ్, కాసాని లచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles