సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Thu,October 17, 2019 02:04 AM

రామడుగు: రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు పెంచుతూ ఆదేశాలు జారీ చేయడంతో మండలంలోని గోపాల్‌రావుపేటలో బుధవారం పారిశుధ్య కార్మికులు, సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడంలో కీలకపాత్ర వహించామని తెలిపారు. చాలిచాలనీ జీతంతో కాలం వెళ్లదీస్తున్నామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ సీఎం కేసీఆర్ జీతాలు పెంచడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం మిఠాయిలను పంచిపెట్టారు. ఇందులో సర్పంచ్ కర్ర సత్యప్రసన్న, ఎంపీటీసీల, ఉపసర్పంచుల ఫోరం మండలాధ్యక్షులు ఎడవెల్లి నరేందర్‌రెడ్డి, ఎడవెల్లి మధుసూధన్‌రెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు ఎండీ రజబ్‌అలీ, నాయకులు దాసరి అరుణ్‌కుమార్, పూడూరి మల్లేశం, పైండ్ల శ్రీనివాస్, కొలిపాక కమలాకర్, నార్ల రమేశ్, బత్తిని శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సిబ్బంది పొన్నం శ్రీనివాస్, జాతి గోపాల్‌రెడ్డి, దాసరి రాజయ్య, గంగాధర లచ్చయ్య, రేనికుంట మొండ య్య, గంగాధర లచ్చమ్మ, దుర్శేటి రజిత, ఇందుర్తి గంగవ్వ, రేనికుంట పోచయ్య తదితరులు ఉన్నారు.

66
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles