మల్బరీ సాగుతో అధిక లాభాలు

Thu,October 17, 2019 02:02 AM

హుజూరాబాద్ రూరల్: రైతులు చిన్నచిన్న మెళకువలు పాటిస్తే మల్బరీ సాగులో అధిక లాభాలు పొందవచ్చని పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్ మదన్ మోహన్‌రావు సూచించారు. బుధవారం తుమ్మనపల్లి గ్రామంలో ఉద్యానవన, పట్టు పరిశ్రమ ఆధ్వర్యంలో మల్బరీ సాగు (పట్టు పురుగుల పెంపకం)పై రైతులతో నిర్వహించిన అవగహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. తెలంగాణ ఏర్పడక ముందు మల్బరీ సాగు తక్కువగా చేసేవారనీ, ప్రత్యేక రాష్ట్రం తర్వాత సాగు విస్తీర్ణం అధికంగా పెరిగిందని గుర్తుచేశారు. పట్టు పురుగుల పెంపకానికి తెలంగాణ వాతావరణం అనుకూలంగా ఉంటుందని చెప్పారు. సాకి సెంటర్, సిల్క్ రిలింగ్ యూనిట్‌లను ఏర్పాటు చేసుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు సబ్సిడీలు అందజేస్తున్నాయని, ఆసక్తిగల రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

గజ్వేల్ వద్ద మల్టీ ఎండ్ రిలింగ్ (పట్టు తీసే యంత్రం) యూనిట్‌ను ప్రారంభిస్తున్నారనీ, దాంతో రాబోయే రోజుల్లో పట్టుగూళ్లకు డిమాండ్ పెరుగుతుందని పేర్కొన్నారు. గతంలో పట్టుగూళ్ల రిలింగ్ యూనిట్ జనగామలో మాత్రమే ఉండేదనీ, గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోయారన్నారు. ప్రస్తుతం సూర్యాపేట, హైదరాబాద్‌తోపాటు మరో 8 రిలింగ్ యూనిట్లు ఏర్పడడంతో పట్టు పురుగుల గూళ్లకు డిమాండ్ పెరిగిందని తెలిపారు. గతేడాది దేశంలోనే నాణ్యమైన పట్టును ఉత్పత్తి చేయడంతో తెలంగాణ ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైందని గుర్తుచేశారు. ఇందులో శాస్త్రవేత్తలు ప్రవీణ్‌కుమార్, సంజీవరావు, ఏడీ ఆదిరెడ్డి, పట్టు పరిశ్రమశాఖ అధికారులు రమేశ్, జగన్, మొగిలి, సర్పం చ్ గూడూరి ప్రతాప్‌రెడ్డి, ఎంపీటీసీ యాళ్వ రాజేశ్వర్‌రెడ్డి రైతులు ఉన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles