తెలంగాణలో అన్నివర్గాలకు సమన్యాయం

Thu,October 17, 2019 02:01 AM

కరీంనగర్ రూరల్: తెలంగాణ ప్రభుత్వ హయాంలో అన్నివర్గాల ప్రజలకు సమన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ, పౌర సఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధవారం కరీంనగర్ మండలంలోని తీగలగుట్టపల్లి రేణుక ఎల్లమ్మ దేవీ పట్నాలకు మంత్రి గంగుల హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజలను చల్లంగా చూడాలని అమ్మవారికి కోరుకున్నట్లు తెలిపారు. ప్రత్యేక నిధులు కేటాయించి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. తీగల గుట్టపల్లి- ఆరెపల్లి బీట్ రోడ్డు నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు రోడ్డు నిర్మాణం చేపడుతామని వెల్లడించారు. అంతకుముందు సంప్రదాయ నృత్యాలు, డప్పు చప్పుళ్లతో మంత్రికి స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ మండల కన్వీనర్ కాశెట్టి శ్రీనివాస్, తీగలగుట్టపల్లి మాజీ సర్పంచ్ దాసరి కిష్టయ్య, మూల రవీందర్‌రెడ్డి, సాగర్, రాజిరెడ్డి, కట్ల సంజీవరెడ్డి, గౌడ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

74
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles