ఉత్సాహంగా ఆర్మీ ర్యాలీ

Wed,October 16, 2019 02:02 AM

-తొమ్మిదో రోజు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ విభాగంలో ఎంపిక
-రాష్ట్ర నలుమూలల నుంచి హాజరు
-కొనసాగుతున్న వైద్య పరీక్షలు
కరీంనగర్ స్పోర్ట్స్: నగరంలోని అంబేద్కర్ స్టేడియంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ర్యాలీ ఉత్సాహంగా కొనసాగుతున్నది. రోజూ రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న యువకులతో స్టేడియంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారుతున్నాయి. ఈ నెల 7న ప్రారంభమైన ర్యాలీ 17తో ముగియనున్నది. తొమ్మిదో రోజు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ర్యాలీ నిర్వహించగా, ఇందులో పాల్గొనేందుకు రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన 2,111 మంది యువకులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ప్రారంభించిన ర్యాలీలో సుమారు 1400 మంది పాల్గొన్నారు. ఆన్‌లైన్‌కు సంబంధించిన అడ్మిట్ కార్డును పరిశీలించిన అనంతరం అభ్యర్థులను స్టేడియానికి అనుమతించి 1.6 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించారు. నిర్ణీత సమయంలో పూర్తిచేసిన వారికి ఇతర శారీరక పరీక్షలు చేపట్టారు. అనంతరం ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి, వైద్య పరీక్షల కోసం సుమారు 200 మంది యువకులను ఎంపిక చేశారు. షెడ్యూల్ ప్రకారం ఆర్మీ ర్యాలీ నిర్వహిస్తూనే అర్హత పరీక్షలను విజయవంతంగా పూర్తిచేసిన అభ్యర్థులకు ఆర్మీ వైద్యాధికారుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు. కాగా, ర్యాలీకి వచ్చే అభ్యర్థులకు 1.6 కిలోమీటర్ల పరుగుపందెంపై సరైన అవగాహన, ప్రాక్టీస్ లేకపోవడంతో అధిక సంఖ్యలో వెనుదిరుగుతున్నారు. పరుగు పందెంను నిర్ణీత సమయంలో పూర్తి చేసిన 75 శాతం యువకులు ఇతర పరీక్షలను సునాయాసంగా పూర్తిచేసి విజయం సాధిస్తున్నారు. 16న ట్రేడ్‌మెన్ ఉద్యోగాల కోసం 4452, 17న అదే విభాగంలో 4344 మందికి అర్హత పరీక్షల నిర్వహణతో ర్యాలీ ముగియనున్నది.

60
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles