శ్మశానవాటికల నిర్మాణంలో వేగం పెంచాలి

Tue,October 15, 2019 02:50 AM

గన్నేరువరం: ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణం చేపట్టి, వేగంగా పూర్తి చేయించాలని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో శ్మశాన వాటిక నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో శ్మశానవాటిలకు అవసరమైన స్థలాన్ని గుర్తించాలని అధికారులకు సూచించారు. ఆధునిక హంగులతో నిర్మించి, పూర్తి స్థాయి సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు లింగాల మల్లారెడ్డి, జడ్పీటీసీ మాడుగుల రవీందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గూడెల్లి తిరుపతి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు గూడెల్లి ఆంజనేయులు, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ రఫీ, ఎంపీడీవో సురేందర్‌రెడ్డి, ఎంపీవో నర్సింహారెడ్డి, సర్పంచ్ బేతెల్లి సమత, పంచాయతీ కార్యదర్శి అశ్విని, ఉప సర్పంచ్ చింతల పద్మ, టీఆర్‌ఎస్ నాయకులు బేతెల్లి రాజేందర్‌రెడ్డి, చింతల పరశురాములు, ఏలేటి చంద్రారెడ్డి, న్యాత సుధాకర్, బొడ్డు సునీల్, చాడ తిరుపతిరెడ్డి, వంగల సత్యనారాయణరెడ్డి, చింతల రవి, గూడూరి సురేశ్, ప్రశాంత్ రెడ్డి, చింతల అనిల్, వార్డు సభ్యుడు సురేశ్, క్షేత్ర సహాయకుడు హన్మండ్ల యాదగిరి, కారోబార్ జేపీ, గ్రామస్తులు పాల్గొన్నారు.


71
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles