దరఖాస్తుల వెల్లువ

Tue,October 15, 2019 02:50 AM

కరీంనగర్ క్రైం : రెండు రోజుల్లో మద్యం దు కాణాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుండడంతో వ్యాపారులు టెండర్ల దాఖలుకు పోటీ పడుతున్నారు. సోమవారంతో కరీంనగర్ జిల్లాలోని 87 మద్యం దుకాణాలకు గాను 330 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ తెలిపారు. కరీంనగర్ ఆర్బన్ పరిధిలోని 21 దుకాణాలకు 70 దరఖాస్తులు రాగా, రూరల్ 25 దుకాణాలకు 96, తిమ్మాపూర్ 12 దుకాణాలకు 87, హు జూరాబాద్ 15 దుకాణాలకు 57, జమ్మికుం ట 14 దుకాణాలకు 20 దరఖాస్తులు వచ్చా యి. ఈఎండీ లేకపోవడం, సులభమైన దరఖాస్తు విధానంతో క్లస్టర్ పద్ధ్దతి ఏర్పాటుతో మ ద్యం దుకాణాలకు పోటీ పడే వారి సంఖ్య పెరిగిందని సూపరింటెండెంట్ తెలిపారు. రెండు రోజుల్లో గడువు ముగియనుందన్నారు.

67
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles