ఎల్‌ఎండీ నుంచి దిగువకు నీళ్లు

Mon,October 14, 2019 02:44 AM

-పూజలు చేసి విడుదల చేసిన అధికారులు
-మొదట 500, రాత్రి వరకు మూడు వేల క్యూసెక్కులు
-దశలవారీగా పెంచుతామని వెల్లడి
-నీటిని వృథా చేయొద్దని రైతులకు సూచన

తిమ్మాపూర్, నమస్తే తెలంగాణ: తిమ్మాపూర్ మండలం ఎల్‌ఎండీ కాలనీలోని లోయర్ మానేర్ డ్యాం (ఎల్‌ఎండీ) నుంచి ఆదివారం కాకతీయ కాలువ ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వం,ఎస్సారెస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎస్సారెస్పీ ఏఈలు జీ కాళీదాస్, ఎం.వంశీ, ఏఈఈ అంజుం ఉన్నీసా హెడ్ రెగ్యులేటరీ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎస్సారెస్పీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కాకతీయ కాలువ ద్వారా స్టేజి-1,2 పరిధిలోని కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం పరిధి ఆయకట్టుతోపాటు చెరువులు, కుంటలకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. మొదట కాకతీయ కాలువ ద్వారా దిగువకు ఐదు వందల క్యూసెక్యుల నీటిని విడుదల చేశామనీ, మధ్యాహ్నం వరకు రెండు వేలు, రాత్రి వరకు మూడు వేల క్యూసెక్కుల వరకు పెంచామనీ, దశలవారీగా మరింత పెంచుతామని ప్రకటించారు. రైతులు నీటిని వృథా చేయవద్దనీ, పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సారెస్పీ సిబ్బంది లకా్ష్మరెడ్డి, నారాయణ, తదితరులున్నారు.

124
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles