మీ భవిష్యత్.. మీ చేతుల్లోనే

Mon,October 14, 2019 02:41 AM

కాల్వశ్రీరాంపూర్: ఫలానా కోర్సులు తీసుకుంటే భవిష్యత్‌లో మంచి ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా నువ్వు ఆ కోర్సునే ఎంచుకోవాలి. మేము చెప్పిన సబ్జెక్టులే ఎంపిక చేసుకోవాలి. ను వ్వు అలాగే చదవాలి అని నేటికాలం విద్యార్థుల కు తల్లిదండ్రులు ఇచ్చే ఆదేశాలివి. నచ్చిన కోర్సులను చదవలేక, ఒత్తిడిని తట్టుకోలేక డిప్రెషన్‌లోకి వెళ్లే విద్యార్థులు కొందరైతే.. పరీక్షల్లో ఫెయిలై అఘాయిత్యాలకు పాల్పడే విద్యార్థులు మరి కొందరు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో మార్పు తెచ్చేందుకు తెలంగాణ విద్యాశాఖ అధికారులు నూతన విధానాన్ని రూపొందించారు. విద్యార్థుల అభిరుచిని తెలుసుకొని, వారికి అనుగుణమైన రంగాలను సూచించ డం, ఈ మేరకు తల్లిదండ్రులను సన్నద్ధం చేయ డం లక్ష్యంగా విధివిధానాలు తయారు చేశారు. మీ భవిష్కత్ మీ చేతుల్లోనే అనే విధంగా వారికి అవగాహన కల్పిస్తున్నారు.

ప్రభు త్వ మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్‌పై మార్గదర్శనం చేసేందు కు ప్రభుత్వం మై చాయిస్-మై ఫ్యూచర్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థులకు కొన్ని ప్రశ్నలతో కూడిన సైకో మెట్రిక్ టెస్టును నిర్వహిస్తున్నారు. ఈ ఆన్‌లైన్ ఆధారిత పరీక్షలో ప్రతి ప్రశ్నకు ఐదు ఆప్షనల్ అన్సర్స్ ఉంటాయి. తమ అవగాహనకు అనుగుణంగా విద్యార్థులు ఒక జవాబును ఎంపిక చేసుకోవాలి. 60నిమిషాల్లో విద్యార్థి పరీక్షను పూర్తి చేయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి ప్రాథమిక లక్షణాలు, బ లాలు, ఆశక్తులు ప్రవర్తనను తెలిసేలా రూపొందించి ఉంటాయి. విద్యార్థి సామర్థ్యాన్ని తెలుసుకొవడంతో పాటు ఆయా అంశాలపై మార్గనిర్దేశం చేసేందుకు విద్యాశాఖ అధికారులు ఈ పరీక్షను రూపొందించారు. కార్యక్రమ నిర్వహణ కోసం ప్రతి పాఠశాల నుంచి ఓ ఉపాధ్యాయున్ని ఎంపిక చేసి ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.

విద్యార్థుల తల్తిదండ్రులకు అవగాహన
కోఆర్డినేటర్ విద్యార్థులకు ఆన్‌లైన్ పరీక్షా విధానంపై అవగాహనతోపాటు, వారు పరీక్షలోని ప్రశ్నలకు నిర్ణీత సమయంలోపు సమాధానాలిచ్చేలా చూస్తాడు. విద్యార్ధి సైకో మెట్రిక్ టెస్టును పూర్తి చే శాక అతడు ఇచ్చిన సమాధానాల ఆధారంగా సమన్వయకర్త 20పేజీల విశ్లేషణాత్మక నివేదిక రూ పొందిస్తారు. విద్యార్థి ఏ రంగంలో ఆసక్తి చూ పుతున్నాడు. ఏ కోర్సును చదివితే రా ణించగలడు అనే విషయాలపై తల్లిదండ్రులకు వివరిస్తారు. ప దో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కో ర్సు లు, ఆయా కోర్సుల్లో ఏది విద్యార్థికి అనుగుణంగా ఉంటుందో తల్లిదండ్రులకు వివరిస్తారు. భవిష్యత్ కోర్సులపై విద్యార్థికి కెరీర్ గైడెన్స్ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. విద్యార్థుల అభిరుచులకు అనుగుణం గా వ్యవహరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి పిల్లల ఉజ్వల భవితకు బాటలు వేయ డమే మై చాయిస్-మై ఫ్యూచర్ ముఖ్య ఉద్దేశం.

65
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles