రమణీయం శ్రీవారి రథోత్సవం

Mon,October 14, 2019 02:41 AM

సిరిసిల్ల టౌన్: బ్రహ్మోత్సవాల్లో భాగంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన శ్రీ లక్ష్మీవేం కటేశ్వర స్వామి రథోత్సవం రమణీయంగా సాగింది. గోవింద నామస్మరణలతో పురవీధులు మార్మోగాయి. భక్తుల కోలాటాలు, చిన్నారుల నృత్యాల మధ్య కనులవిందుగా సాగింది. రాష్ట్రంలోనే అతిపెద్ద రథం కావడంతో ఉత్సవాన్ని వీక్షించేందుకు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి లక్షకుపైగా భక్తులు తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన రథోత్సవం భక్తుల జయజయ ధ్వానాల నడుమ గంటకు పైగా సాగింది. ఆలయ నిర్మాణ వంశీయుడు చెన్నమనేని వెంకట్రావు రథసారథిగా వ్యవహరించారు.

కలెక్టర్ ప్రత్యేక పూజలు..
శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి రథోత్సవంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొన్నారు. రథంపై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు కలెక్టర్‌కు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పావని, టీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు చక్రపాణి, ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

47
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles