మద్యం దుకాణాలకు 126 దరఖాస్తులు

Sun,October 13, 2019 12:55 AM

కరీంనగర్‌ క్రైం : జిల్లాలో కొత్త మద్యం దుకాణాలకు ఇప్పటి వరకు 126 దరఖాస్తులు స్వీకరించినట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ వెల్లడించారు. శనివారం కలెక్టరేట్‌లోని రూరల్‌ తాసిల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 87 మద్యం దుకాణాలకు గాను ఈ నెల 9న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. 2017-19 సంవత్సరంతో పోలిస్తే ఈ సారి ఎక్కువ దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. 2017-19 సంవత్సరానికి మొత్తం 1,084 దరఖాస్తులు రాగా, ఈసారి ఇంకా ఎక్కువ రావచ్చని అంచనా వేసినట్లు చెప్పారు. చివరి రెండు రోజులు దరఖాస్తుదారుల తాకిడి ఎక్కువగా ఉంటుందనీ, అందుకు తగ్గట్లు కౌంటర్లు, బారికేడింగ్‌ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. చివరి రోజు క్యూలైన్లలో చివరి నుంచి 1వ నెంబర్‌తో టోకెన్లు జారీ చేయాలని సూచించారు. ఎక్కువ సిబ్బందిని ఏర్పాటు చేసి వేగంగా దరఖాస్తులు స్వీకరించాలన్నారు. 2001 జనాభా లెక్కల ప్రకారం 6 స్లాబుల్లో లైసెన్స్‌ విధానం ఉంటుందనీ, కరీంనగర్‌ జిల్లాలో 3 స్లాబుల్లో లైసెన్స్‌ ఫీజు ఉందని తెలిపారు. 50 లక్షల స్లాబులో 12 దుకాణాలు, 55 లక్షల స్లాబులో 41 దుకాణాలు, 65 లక్షల స్లాబులో 34 దుకాణాలు ఉన్నాయని తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మొదటి రోజు ఈ నెల 9న 3, రెండో రోజు 7, నాలుగో రోజు 45, 5వ రోజు 71 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ కే చంద్రశేఖర్‌, ఎక్సైజ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

114
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles