అయోధ్య రామారావు ఇకలేరు

Sat,October 12, 2019 02:05 AM

కరీంనగర్ ఎడ్యుకేషన్: గత ఐదు దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యా రంగానికి ఎనలేని సేవలు అందించిన విద్యా వేత్త, వాణీనికేతన్ విద్యా సంస్థల అధినేత అయోధ్య రామారావు శుక్రవారం కన్నుమూశారు.గత కొంత కాలంగా శ్వాస సంబంధ సమస్యతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్‌లోని యశోద దవాఖానలో చికిత్స పొందారు. పది రోజుల కిందట ఆయనను కుటుంబ సభ్యులు కరీంనగర్‌లోని ఇంటికి తీసుకురాగా, శుక్రవారం పరిస్థితి విషమించడంతో మరణించారు. ఆయన వయస్సు 82 సంవత్సరాలు కాగా, రామడుగు మండలం వెదిర గ్రామంలో హన్మంతరావు, యశోదమ్మ దంపతులకు జూలై 21, 1937వ సంవత్సరంలో జన్మించారు. వీరి ప్రాథమిక విద్యాభ్యాసం కరీంనగర్‌లో జరిగింది. తర్వాత ఉస్మానియా వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేశారు.

82
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles