వైద్యురాలిపై చర్యలు తీసుకోవాలి

Sat,October 12, 2019 02:04 AM

కరీంనగర్ హెల్త్ : జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో పని చేసే పిల్లల వైద్య నిపుణురాలు శుభాంగిణిపై చర్యలు తీసుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్‌కు కరీంనగర్‌కు చెందిన మంచిల్ల స్వర్ణ శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ, గురువారం తన ఏడాదిన్నర బాబు అభిషేక్‌కు జ్వరం రావడంతో ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చాననీ, పరీక్షించిన వైద్యులు రక్త పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించగా అక్కడ సిబ్బంది అభిషేక్‌కు ప్లేట్‌లెట్స్ 500గా ఇచ్చారని తెలిపారు. దీంతో అభిషేక్ పరిస్థితి విషమంగా ఉందని వరంగల్‌కు తరలించాలని వైద్యులు సూచించారనీ, అప్పు చేసి వరంగల్ ఎంజీఎంకు తరలించామన్నారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అభిషేక్‌కు 3 లక్షల 90 వేల ప్లేట్‌లెట్స్ ఉన్నట్లు నిర్ధారించారని చెప్పారు. అభిషేక్ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాడని చెప్పారన్నారు. దీంతో శుక్రవారం దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ అజయ్‌కుమార్, ఆర్‌ఎంఓ డాక్టర్ శ్రీధర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ల్యాబ్ సిబ్బంది ఎవరికైనా ప్లేట్‌లెట్స్‌ను మూడు అంకెలతోనే ఇస్తారనీ, 500 కాదనీ, అది 5 లక్షలుగా ఉంటుందనీ, కనీసం వైద్యులు ఇలా గుర్తించకపోవడం దారుణమన్నారు.

కాగా, ప్లేట్‌లెట్స్ 500కు తగ్గితే పేషెంట్ పరిస్థితి విషమంగా ఉంటుందనీ, బ్లీడింగ్‌తోపాటు దురద వస్తుందనీ, అలాంటిది ఏం లేకున్నా ఇలా చేయడమేంటని సూపరింటెండెంట్ సదరు వైద్యురాలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రిపోర్టులో ఇంత తక్కువ ప్లేట్‌లెట్స్ ఉంటే మరోసారి రక్త పరీక్షలు చేయాల్సి ఉండగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సబబు కాదని పేర్కొన్నారు.

70
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles