మనస్తాపంతో చిట్‌ఫండ్ మేనేజర్ ఆత్మహత్య

Sat,October 12, 2019 02:04 AM

కరీంనగర్ క్రైం: ఓ వైపు అప్పులు, మరో వైపు టార్గెట్ రీచ్ కాకపోవడంతో తన హోదా తగ్గించారనే మనస్థాపంతో ఓ చిట్‌ఫండ్ కంపెనీ మేనేజర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో శుక్రవారం జరిగింది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దామెరకుంటకు చెందిన చింతమడక సతీశ్ (35) ప్రస్తుతం కరీంనగర్‌లోని ఓ చిట్‌ఫండ్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంచిర్యాల బ్రాంచి నుంచి 8 నెలల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చారు. అయితే, మంచిర్యాలలో రెండేళ్లు పని చేసిన సతీశ్ కంపెనీ ఇచ్చిన టార్గెట్లను రీచ్ అయ్యేందుకు అప్పులు చేసి, అతను పనిచేసి సంస్థలోనే చిట్టీలు వేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విషయం బయట పడడంతో అతడిని కరీంనగర్‌కు బదిలీ చేశారు. తన పనికి తగ్గ హోదా లేకపోవడం, మరో వైపు అప్పులతో మనస్తాపం చెంది వావిలాలపల్లిలో తాను అద్దెకుంటున్న ఇంట్లోనే గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు త్రీటౌన్ సీఐ విజ్ఞాన్‌రావు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ప్రభుత్వ దవాఖానకు చేరుకొని, ఆందోళన చేపట్టారు. చిట్‌ఫండ్ కంపెనీ వేధింపుల వల్లే చనిపోయాడని ఆరోపించారు. సతీశ్‌కు దాదాపు రూ. 50 లక్షల వరకు అప్పులున్నట్లు బంధువులు చెబుతున్నారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles