మీ కృషి ప్రశంసనీయం

Sat,October 12, 2019 02:03 AM

కలెక్టరేట్: స్వచ్ఛతలో ప్రత్యేకతను చాటి చెప్పుతూ పెద్దపల్లి జిల్లా అభివృద్ధికి కలెక్టర్ శ్రీదేవసేన చేస్తు న్న కృషి ప్రశంసనీయమని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. స్వచ్ఛ స ర్వేక్షణ్ గ్రామీణ్-2019లో అవార్డు సాధించిన సందర్భంగా హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ఈశ్వర్‌ను పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ కలెక్టర్‌ను ప్రత్యేకంగా అభినందిస్తూ భవిష్యత్‌లో జిల్లాను మ రింత అభివృద్ధి పథంలో నడిపించాలనీ స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్-2019లో జాతీయస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచి అవా ర్డు కైవసం చేసుకోవడం జిల్లా ప్రజలకు గర్వకారణమని అన్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాం తాల్లో పారిశుధ్య చర్యల్లో భాగంగా ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకున్న చర్యలతో జిల్లాకు దేశంలోనే ప్రత్యేకత లభించిందని పేర్కొన్నారు. కలెక్టర్‌గా పెద్దపల్లి జిల్లాలో శ్రీదేవసేన చేపట్టిన కార్యక్రమాలకు ప్రధాని నరేంద్రమోదీతోపాటు సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా ప్రశంసించి అభినందించారని వివరించారు. భవిష్యత్‌లోనూ ప్లాస్టిక్ నిషేధం, గ్రామీణాభివృద్ధి తదితర అంశాల్లో ముందుకు సాగుతూ జిల్లాను రాష్ర్టానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి ఈశ్వర్ కలెక్టర్‌కు సూచించారు.

49
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles