ప్రణాళికలో భాగస్వాములుకండి

Sun,September 15, 2019 02:47 AM

ఇల్లందకుంట: పల్లె ప్రణాళికలో ప్రజందరూ భాగస్వాములు కావాలని జడ్పీ చైర్‌పర్సన్ కనుమల్ల విజయ పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని సిరిసేడు గ్రామంలో గుర్తించిన సమస్యలు, చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్షించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, గ్రామాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేసుకోవాలనీ, ప్రతి ఇంటి అవరణలో ఐదు మొక్కలను నాటాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్లాస్టిక్ నివారణ కోసం ప్లాస్టిక్ యూనిట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎంపీపీ సరిగొమ్ముల పావనివెంకటేశ్, సర్పంచ్ రఫీఖాన్, ఎంపీటీసీ రాయుడు, ప్రత్యేకాధికారి శ్రీనివాస్, ఎంపీడీవో ఈ స్వరూప, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

51
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles