కొండగట్టుకు జీకే యూత్ పాదయాత్ర

Sun,September 15, 2019 02:46 AM

కార్పొరేషన్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రిగా గంగుల కమలాకర్ బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూ గంగుల కమలాకర్ యూత్(జీకేయూత్) ఆధ్వర్యంలో కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు పాదయాత్ర నిర్వహించారు. స్థానిక ప్రసన్నాంజనేయ దేవాలయం వద్ద ప్రత్యేక పూజల అనంతరం మాజీ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేశ్ ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, గంగుల ప్రదీప్, జీకే యూత్ ప్రతినిధులు ఎం. వెంకట్, టీఆర్‌ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, నాయకులు మహేశ్, శైలేందర్, చిట్టుమల్ల శ్రీనివాస్, నవాజ్ రవికుమార్‌గౌడ్, గందె కల్పన, పొన్నం రాజు, ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

61
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles