ఆర్టికల్ 370 ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణం

Sat,September 14, 2019 03:04 AM

తెలంగాణచౌక్: జమ్ముకశ్మీర్‌లో 370 ఆర్టికల్ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీయే కారణమని భారతీయ జనతాపార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సుగుణాకర్‌రావు అరోపించారు. శుక్రవారం స్థానిక ప్రైవేట్ ఫంక్షన్‌హాల్‌లో పార్టీ కార్యశాల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కశ్మీర్, తెలంగాణ బాధ్యతలను జవహర్‌లాల్ నెహ్రూ, పటేల్‌కు అప్పగించారన్నారు. కశ్మీర్ బాధ్యతలను నెహ్రూ తీసుకున్నారనీ, తెలంగాణ ప్రాంత సంస్థానాల విలీనాల బాధ్యతను పటేల్‌కు అప్పగించారని చెప్పారు. తెలంగాణను పటేల్ బేషరతుగా విలీనం చేయించారనీ, కానీ కశ్మీర్‌ను మాత్రం నెహ్రూ తన స్వార్థ రాజకీయం కోసం అప్పటి రాజుకు వ్యతిరేకంగా వ్యవహరించి, ఇతర నాయకులకు అనూకులంగా 370 ఆర్టికల్ ఏర్పాటుకు కారకుడయ్యాడని ఆరోపించారు. ఇక్కడ పార్టీ రాష్ట్ర నాయకులు అల్జపురి శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌రెడ్డితోపాటు మండల నాయకులు పాల్గొన్నారు.

64
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles