ఉష్ణతాపాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి


Tue,December 3, 2019 02:26 AM

-తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌
-ప్రారంభమైన ‘కౌంటర్‌ మెజర్స్‌ టు అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌' 5వ అంతర్జాతీయ సమావేశం
సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పట్టణ ప్రాంతాల్లో పెరిగిపోతోన్న వేడి, ఉష్ణతాపాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌కుమార్‌ అన్నారు. ప్రధానంగా వేడి, ఉష్ణతల పట్టణాలు, నగరాలలో రోజు రోజుకూ పెరిగిపోతున్న ఉష్ణము(వేడి), గాలి కాలుష్యాలను తగ్గించుకునే ప్రయత్నాలలో తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా మూడు రోజుల ఐదో (ఫిఫ్త్‌ ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ కౌంటర్‌ మెజర్స్‌ టు అర్బన్‌ హీట్‌ ఐలాండ్స్‌) అంతర్జాతీయ సమావేశం సోమవారం ఉద యం గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ప్రారంభమైంది. ఈ తరహా సమావేశం హైదరాబాద్‌లో జరగడం ప్రప్రథమం. గతంలో ఈ సమావేశాలు టోక్యో, బర్కిలీ (కాలిఫోర్నియా), వెనిస్‌, సింగపూర్లలో జరిగాయి. ప్రస్తు తం హైదరాబాద్‌లో మూడు రోజులపాటు జరుగుతోంది. ట్రిపుల్‌ ఐటీ హైదరాబాద్‌ నిర్వహించిన సమావేశానికి శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, బిల్డర్లు, వాస్తు శిల్పులు, ఇంకా ప్రభుత్వాధికారులు రావడం చాలా సందర్భోచితంగా ఉం ది. కార్యక్రమాన్ని తెలంగాణ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరవింద్‌ కుమా ర్‌ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవింద్‌ కుమార్‌ మాట్లాడారు. హైదరాబాద్‌ ప్రస్తుతం 120 మిలియన్ల చదరపు అడుగుల మేరకు వ్యాపారాలను కలిగి ఉందని, రాబోయే రెండు లేదా ఐదేళ్లల్లో తాము అం దుకున్న అన్ని ప్రతిపాదనలను జోడిస్తే అది 2025వ సం వత్సరం నాటికి 140 మిలియన్ల అడుగులకు పెరుగుతోందన్నారు.


కాబట్టి (నగర తల ద్వీపం) తక్కువ వ్యవధిలోనే ఎలా రెట్టింపు అవుతుం దో మనం ఊహించగలం. అందువల్ల నగరాలు, పట్టణాల ప్రతిఘటనలను గురించి చర్చించడంలో ఇలాంటి సమావేశం చాలా సందర్భోచితమన్నా రు. పట్టణంలోచోటు చేసుకున్న వేడి దీవులు, ద్వీపాలను తగ్గించడానికి ప్రభుత్వం ఎదుర్కొంటున్న ప్రతికూలతలను ఆయన వివరించారు. రాష్ట్రంలోని 33 జిల్లాలలకు సంబంధించి పట్టణ, స్థాని క సంస్థలకు హరిత కార్యాచరణ ప్రణాళిక ఐదేళ్ల వరకు ఉంటుందన్నారు. ప్రతి పట్టణ స్థానిక సం స్థ (యుఎల్‌బీ)కు నర్సరీ ఉండాలని, బడ్జెట్‌లో 10శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కోసం మొదటి చార్జీగా కేటాయించాలన్నారు. నీటి ఆడిట్‌ను నిర్వహించాలని, ఇంకా ఆదాయేతర నీటిని కనిష్టానికి తగ్గించాలన్నారు. ట్రాఫి క్‌, మౌలిక సదుపాయాలను పరిష్కరించడానికి పట్టణ ప్రణాళిక అవసరమైన చర్యలను తీసుకుంటోందని, ఇం టిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ల అభివృద్ధిని రా ష్ట్రం ప్రోత్సహిస్తోందన్నారు. వేసవిలో చాలా నగరాల్లో అధిక వేడి, పొగమం చు “అర్బన్‌ హీట్‌ ఐలాం డ్‌” నిర్మా ణ సామగ్రి ఎంపికలు, వృక్ష సంపద లేకపోవ డం, పట్టణ రూపకల్పనలు మొదలైనవన్నీ ప్రధాన కారణంగా గుర్తించబడ్డాయన్నారు. వేసవిలో అధిక వేడి, వాయుకాలుష్యాన్ని తగ్గించడానికి ఈ సమావేశం సైన్స్‌, ఇంజినీరింగ్‌, పబ్లిక్‌ పాలసీలకు అంకితం చేయబడిందన్నారు. అర్బన్‌ హీట్‌ ఐలాండ్‌పై కేస్‌ స్టడీ సహా నాలుగు సమాంతర సెషన్లలో సుమారు 100 టెక్నికల్‌ పేపర్‌ ప్రజెంటేషన్లు మూడు రోజుల్లో సమావేశంలో ప్రదర్శించబడనున్నాయి.

284

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles