మర్రి చెన్నారెడ్డి సేవలు మరువలేనివి


Tue,December 3, 2019 02:24 AM

కవాడిగూడ: మాజీ గవర్నర్‌, మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి సేవలు మరువలేనివని హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. మర్రి చెన్నారెడ్డి 23వ వర్ధంతిని పురస్కరించుకొని ఇందిరాపార్కులోని మర్రి చెన్నారెడ్డి మోమోరియల్‌ రాక్‌గార్డెన్‌లోని ఆయన సమాధి వద్ద హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ నివాళులర్పించారు. ఈ సదర్భంగా దత్తాత్రేయ మా ట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మర్రి చెన్నారెడ్డిది కీలక పాత్ర అని పేర్కొన్నారు. కాశ్మీర్‌ సమస్య పరిష్కారమవుతుందని ఆనాడే నిర్మొహమాటంగా చెప్పిన గొప్ప వ్యక్తి చెన్నారెడ్డి అన్నారు. మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో చెన్నారెడ్డి పాత్ర కీలకమైందన్నారు. మలిదశ ఉద్యమంలో కేసీఆర్‌ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు. హామీకి కట్టుబడి తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ అన్ని వర్గాలను కలుపుకొని మంచి పాలన అందించిన మహోన్నత వ్యక్తి చెన్నారెడ్డి అని కొనియాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాలకు న్యాయం జరిగినప్పుడే మనం చెన్నారెడ్డికి నిజమైన నివాళి అర్పించిన వారమవుతామన్నారు. అంతకు ముందు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తలసేమియా వ్యాధిగ్రస్తులకోసం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్నిబండారు దత్తాత్రేయ ప్రారంభించారు.మాజే కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వి.హనుమంతరావు, అంజన్‌కుమార్‌యాదవ్‌, చెన్నారెడ్డి తనయుడు మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ మంత్రి జానారెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముదిరెడ్డి కోదండరెడ్డి, నాయకులు గడ్డం ప్రసాదరావు, సమరసింహారెడ్డి, సి.కృష్ణాయాదవ్‌, నిరంజన్‌, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్‌కుమార్‌యాదవ్‌, మాజీ డిప్యూటీ మేయర్‌ గోల్కొండ రాజ్‌కుమార్‌, ఐఎన్‌టీయూసీ నాయకులు నల్లవెల్లి అంజిరెడ్డి తదితరులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మర్రి చెన్నారెడ్డి పెద్ద కుమారుడు మర్రి రవీందర్‌రెడ్డి, కుటుంబ సభ్యులు, మర్రి ఆధిత్యరెడ్డి, పురోవర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు రావుల శ్రీకాంత్‌, వి.డి.కృష్ణ, శ్రీనివాస్‌, శంకర్‌, రామ్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

278

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles