-అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడుఉప్పల శ్రీనివాస్ గుప్త
-నాగోల్‌లో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం
ఎల్బీనగర్, నమస్తే తెలంగాణ: ఆర్యవైశ్యులకు సీఎం కేసీఆర్ అండదండగా నిలుస్తున్నారని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్‌గుప్త కొనియాడారు. సీఎం కేసీఆర్ ఆర్యవైశ్యులకు ఉప్పల్ బగాయత్‌లో 5 ఎకరాల స్థలాన్ని కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ నాగోల్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం నాగోల్ కో ఆపరేటివ్ బ్యాంక్ కాలనీలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉప్పల శ్రీనివాస్ గుప్త మాట్లాడుతూ ఆర్యవైశ్యులను గుర్తించిన ఏకైక సీఎం కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పాలుపంచుకున్న ఆర్యవైశ్యులకు సీఎం కేసీఆర్ స్థలాన్ని కేటాయించి యావత్ తెలంగాణ ఆర్యవైశ్యుల మనసులు గెలుచుకున్నారని అన్నారు. ఆర్యవైశ్యులందరి తరఫున సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్యవైశ్యులంతా ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లోనూ తెలంగాణ ప్రభుత్వానికి అండగా నిలువాలన్నారు. కార్యక్రమంలో నాగోల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు భిక్షపతి, కోశాధికారి కృష్ణమూర్తి, ప్రతినిధులు నవనీత, మహేశ్, కుమారస్వామి, లక్ష్మీనారాయణ, యాదయ్య, రమేశ్, సురేశ్, రాజమల్లయ్య, సంపత్, జనార్దన్, ప్రవీణ్‌కుమార్, నాగరాజు, బాలు పాల్గొన్నారు.