డిసెంబర్ 8న హలో మాల..చలో ఢిల్లీ


Fri,November 8, 2019 12:28 AM

-మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య
ఖైరతాబాద్ : ఎస్సీ వర్గీకరణ ఆలోచనను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 8న హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య తెలిపారు. ఖైరతాబాద్ మింట్ కాంపౌండ్‌లోని అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్గీకరణ వల్ల దళితుల మధ్య అగాథాలు ఏర్పడుతాయన్నారు. కలిసి కట్టుగా రాజ్యాధికారం సాధించుకోవాలన్నారు. చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రులతోపాటు మాజీ ముఖ్యమంత్రి మాయావతి, జాతీయ దళిత నేతలను కలిసి వారి మద్దతు కూడగడుతామన్నారు. వర్గీకరణ పేరుతో ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ చేస్తున్న కార్యక్రమం నిష్ప్రయోజనమన్నారు. సమావేశంలో మాల మహానాడు వర్కింగ్ ప్రెసిడెంట్ జంగా శ్రీనివాస్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.ఆగమయ్య, గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి మద్దెల వెంకటేశ్, గ్రేటర్ యూత్ అధ్యక్షులు ప్రమోద్, విద్యార్థి విభాగం జాతీయ అధ్యక్షుడు పెరుమాళ్ల అశోక్‌రావు తదితరులు పాల్గొన్నారు.

180

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles