దసరాకు..సొంతూళ్లకు


Tue,October 8, 2019 04:43 AM

-సాధ్యమైనన్ని బస్సులు నడిపించండి.. మేడ్చల్ కలెక్టర్ ఎంవీరెడ్డి
బాలానగర్: ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సాధ్యమైనన్నీ బస్సులు నడిపించేందుకు ముమ్మర కసరత్తు చేయాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఎంవీరెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం కూకట్‌పల్లి డిపోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు రవాణా ఇబ్బందులు దూరం చేసేందుకు అత్యధిక బస్సులు నడిపించేందుకు ప్రయత్నించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ బస్సులను నడిపించాలని సూచించారు. కూకట్‌పల్లి డిపోలో 100 బస్సులకు తగ్గకుండానడిపించి ప్రజలకు సౌకర్యవంతమైన ఏర్పాటు చేయాలని సూచించారు. తాత్కాలిక డ్రైవర్ల డ్రైవింగ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని, డ్రైవింగ్ సరిగా రాని వారికి బస్సులు ఇవ్వరాదని కూకట్‌పల్లి ఎంవీఐ సుశీల్‌రెడ్డికి సూచించారు. ప్రస్తుతం పాఠశాలలకు సెలవులున్నందున పాఠశాల బస్సులను సైతం వినియోగించాలని ఎంవీఐకి సూచించారు. ప్రైవేటు వాహనాలు ప్రజల వద్ద అధిక మొత్తంలో వసూలు చేసే అవకాశాలున్నాయన్నారు. రోజూ బస్‌స్టాప్‌ల్లో నిలబడి ప్రయాణికుల వద్ద డబ్బులు ఎలా వసూలు చేస్తున్నారని గమనించాలని ఎంవీఐ సుశీల్‌రెడ్డికి సూచించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి ఆర్డ్డీవో మధుసూదన్, కూకట్‌పల్లి ఏసీపీ సురేందర్‌రావు, కూకట్‌పల్లి డీవీఎం దేవదానం, డీఎం నర్సింహ, కూకట్‌పల్లి సీఐ బాలకృష్ణారెడ్డి, కూకట్‌పల్లి తహసీల్దార్ నిర్మలతో పాటు ఇతర పోలీసు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

332

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles