పంద్రాగస్టు ఏర్పాట్లు

Wed,August 14, 2019 12:41 AM

-గోల్కొండలోముగిసిన పరేడ్, సీఎం కాన్వాయ్ రిహార్సల్స్
-అధికారులతో చీఫ్ సెక్రెటరీ శైలేందర్‌కుమార్ జోషి సమావేశం
మెహిదీపట్నం: చారిత్రాత్మక గోల్కొండ కోటలో వరుసగా ఆరో సంవత్సరం పంద్రాగస్టు వేడుకలు జరుగనున్నాయి. దీనికోసం కోట సర్వాంగసుందరంగా ముస్తాబైంది. నాలుగు రోజులుగా జెండావందనం కోసం పోలీస్ బలగాలు పరేడ్ రిహార్సల్స్‌ను చేశారు. అంతేకా కుండా సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ మంగళవారం నిర్వహించారు. గోల్కొండ కోటలో అన్నీ శాఖల అధికారులతో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎస్కే జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి భద్రతా సమీక్షా సమావేశం నిర్వహించి అందరికీ బాధ్యతలను అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పోలీస్ బలగాలకు బందోబస్తు విధులను నిర్ణయించారు. అనంతరం పీసీ అంజనీకుమార్ మీడియాతో మాట్లాడుతూ అతిథులందరూ నిర్ణీత సమయానికి గోల్కొండ కోటకు చేరుకోవాలన్నారు. సమయం, రూట్‌లను దృష్టిలో పెట్టుకుని పోలీసులకు అందరూ సహకరించాలన్నారు. 20శాతం వర్షం కురిసే సూచనలు ఉండటంతో దానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.

సీఎం కాన్వాయ్ రిహార్సల్స్...
వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాన్వాయ్‌కు సంబంధించి మంగళవారం పోలీసులు రిహాల్సర్స్‌ను నిర్వహించారు. మాసాబ్‌ట్యాంక్ , మెహిదీపట్నం, రేతిబౌలి, లంగర్‌హౌస్, రాందేవ్‌గూడల మీదుగా ముఖ్యమంత్రి గోల్కొండ కోటకు వస్తారు. ఈవిధంగా ట్రాఫిక్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు సమన్వయంతో ఈ రిహార్సల్స్ నిర్వహించారు. అంతేకాకుండా కోటవద్ద అదనపు బలగాలతోపాటు, యాంటీ సబిటేజ్ బృందాలు, డాగ్‌స్కాడ్, టాస్క్‌ఫోర్స్, అగ్నిమాపక దళాలకు, నగర పోలీసులను మోహరించారు.

కోటలో విద్యార్థుల సందడి
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలకు హాజరయ్యే వివిధ పాఠశాలల విద్యార్థులను మంగళవారం ఆయా పాఠశాలల యాజమాన్యాలు తీసుకొచ్చాయి. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు కేటాయించిన సాంస్కృతిక కార్యక్రమాల కోసం రిహార్సల్స్ చేశారు. దీంతో కోటలో విద్యార్థుల సందడి నెలకొన్నది. బాలహిస్సార్ వద్ద, లోపల గార్డెన్‌లో, జెండా ఆవిష్కరణ చేసే ప్రాంతాల్లో విద్యార్థులు తమ అంశాలను అభ్యసించారు.

మేడ్చల్‌లో ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ ఎంవీరెడ్డి
మేడ్చల్ కలెక్టరేట్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు చేయాలని మేడ్చల్ కలెక్టర్ డాక్టర్ ఎంవీరెడ్డి అధికారులను ఆదేశించారు. మేడ్చల్ కలెక్టరేట్‌లో జరుగుతున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను మంగళవారం కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా రు. వర్షం వచ్చే అవకాశం ఉన్నందున అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ మధుకర్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.

173

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles