కేశవాపూర్ భూ సేకరణపై కసరత్తు ముమ్మరం


Thu,July 11, 2019 01:16 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : నగర తాగునీటి అవసరాల కోసం నిర్మించనున్న కేశవాపూర్ ప్రాజెక్ట్ భూ సేకరణపై ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం రూ. 4396.16కోట్లతో నిర్మించే రిజర్వాయర్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలో దాదాపు 3,965.13 ఎకరాల మేర భూ సేకరణలో భాగంగా తొలుత దేవాదాయ శాఖ స్థలాలపై దృష్టి సారించారు. బొమ్మరాస్‌పేట నీటి శుద్ధి కేంద్రం నిర్మాణానికి 95 ఎకరాల భూమిలో 65 ఎకరాల మేర దేవాదాయ శాఖకు సంబంధించినది కాగా, 30 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం నిర్ణీత రేటు చెల్లించి భూములను జలమండలికి బదలాయించాల్సి ఉంటుంది. ఈ ఆలయ భూముల సేకరణకు ఇప్పటికే జలమండలి దాదాపు రూ.20కోట్ల మేర దేవాదాయ శాఖకు చెల్లించింది.


గ్రేటర్ హైదరాబాద్ తాగునీటికి శాశ్వత ప్రాజెక్టుగా ప్రభుత్వం రూ. 4396.16కోట్లతో నిర్మించ తలపెట్టిన కేశవాపూర్ రిజర్వాయర్ పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించేందుకు జలమండలి కసరత్తు చేస్తున్నది. ఇందుకు ప్రధానంగా భూ సేకరణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో దాదాపు 3,965.13 ఎకరాల మేర భూసేకరణలో తొలుత దేవాదాయ శాఖ భూములపై దృష్టి సారించారు. బొమ్మరాస్‌పేట డబ్ల్యూటీపీ (నీటి శుద్ది కేంద్రం) నిర్మాణానికి 95 ఎకరాల భూమిలో 65 ఎకరాల మేర దేవాదాయ శాఖకు సంబంధించి ఉన్నదని, 30 ఎకరాల మేర ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం ఎకరం నిర్ణీత రేటు చెల్లించి భూములను జలమండలికి బదలాయించాల్సి ఉంటుంది. ఈ ఆలయ భూమి సేకరణకుగానూ ఇప్పటికే జలమండలి దాదాపు రూ. 20కోట్ల మేర దేవాదాయ శాఖకు భూ సేకరణ నిమిత్తం చెల్లించింది. ఐతే తాజాగా దేవాదాయ శాఖ భూములు సేకరించాలంటే చాలా వ్యయంతో కూడుతుందని, ఎకరం సుమారుగా రూ. 60 లక్షల మేర చెల్లించాల్సి వస్తుందని , ఆర్థికంగా సంస్థకు ఇది కష్టసాధ్యంగా ఉందని తాజాగా తేల్చారు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ భూములపై సమాలోచనలు జరుపుతున్నారు. దేవాదాయశాఖకు బదులుగా ఇతర ప్రభుత్వ శాఖకు సంబంధించి భూమికి బదులుగా మరో చోట భూమి బదలాయింపు లాంటి భూ సేకరణపై సన్నాహాలు చేస్తున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కొండ పోచమ్మ రిజర్వాయర్ నుంచి గోదావరి జలాలను తరలించి, నిల్వ చేయనున్నారు.

ఐతే ఈ రిజర్వాయర్ నిర్మాణానికిగాను మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో దాదాపు 3,965.13 ఎకరాల మేర భూసేకరణ జరపాల్సి ఉంది. ఇందులో 1627.17 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, 1207 ఎకరాల అటవీ, 574.10 ఎకరాల పట్టా భూమి ఉంది. మరో 242.24 ఎకరాల అసైన్డ్ భూములతో పాటు 182.35 ఎకరాల మేర దేవాదాయ భూములను కూడా సేకరించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే 300 మీటర్ల బేస్ వెడల్పుతో 4.70 కిలోమీటర్ల మేర నిర్మించనున్న రిజర్వాయర్ బండ్ నిర్మాణానికిగాను ఇప్పటికే 1585 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించి, అందుబాటులో ఉంచారు. అటవీ భూముల సేకరణకు బదులుగా జగిత్యాల అటవీ డివిజన్ పరిధిలో 281 ఎకరాలు, యాదాద్రిలో 580 ఎకరాల భూమిని బదలాయించాలని భావిస్తున్నారు. పట్టా, అసైన్డ్ భూములను సగం మేర చేపట్టేందుకు రూ.438 కోట్లు అవసరం కానుందని అధికారులు గుర్తించారు. మొత్తంగా నిధులపై స్పష్టత వచ్చిన వెంటనే భూ సేకరణ ప్రక్రియను ముమ్మ రం చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కాగా పంప్‌హౌజ్‌లు, పంపింగ్ స్టేషన్లు, భారీ రిజర్వాయర్ నిర్మాణ పనులకు భూ సేకరణ ఆధారంగా పనులు చేపడతారు. ప్రాజెక్టులో ప్రధానంగా ఇన్‌టేక్, పైపులైన్ విస్తరణ, నీటి శుద్ధి కేంద్రం పనులను పూర్తి చేసి భారీ రిజర్వాయర్‌తో సంబంధం లేకుండా అవసరమైన సమయాల్లో నీటిని తరలించేందుకు సిద్ధంగా ఉండేలా ఈ ప్రాజెక్టు పనులను చేపట్టే దిశగా అడుగులు వేస్తుండడం గమనార్హం.

488

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles