రెవెన్యూలో డిప్యుటేషన్లకు చెక్


Thu,July 11, 2019 01:12 AM

సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ : రెవెన్యూలో డిప్యుటేషన్ పై కాలం వెల్లదీద్దామనుకున్న వారి ఆశలపై ఉన్నతాధికారులు నీళ్లు చల్లారు. అనవాయితీగా వస్తున్న డిప్యుటేషన్లకు చెక్‌పెట్టి బదలీలకు సరైన అర్థాన్నిచ్చారు. ఆశావాహుల ప్రయత్నాలను లెక్కచేయకుండా, పోస్టింగ్స్ అయిన చోట చేరిపోవాలని ఖరాఖండిగా తేల్చేశారు. దీంతో సదరు ఆశావాహులకు భంగపాటు తప్పలేదు. వివరాల్లోకి తెలితే.. ఇటీవలే జిల్లా రెవెన్యూలో 16 మంది డిప్యుటీ తాసిల్దార్లు, 19 మంది సీనియర్ అసిస్టెంట్లు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లను బదిలీచేశారు. వీరంతా రెండేండ్ల కంటే ఎక్కువ కాలం నుంచి ఒకే స్థానంలో పాతుకుపోయిన వారే కావడంతో వీరందరికి స్థాన చలనం కల్పించారు.


బదిలీకి గురైన వారికి పోస్టింగ్స్ ఇచ్చిన స్థానాల్లో చేరిపోవాలని ఆదేశాలు జారీచేశారు. అయితే బదిలీ అయిన వారిలో కొంత మంది డిప్యుటేషన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఫోకల్ పోస్టులు.. నచ్చిన స్థానాల్లో పాగా వేయడానికి ప్రయత్నించారు. ఉన్నతాధికారులను ప్రసన్నం చేసుకుని డిప్యుటేషన్ కోసం ప్రయత్నించారు. అయితే వీరి ప్రయత్నాలకు ఉన్నతాధికారులు మోకాలడ్డారు. డిప్యుటేషన్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తే లేదని, పోస్టింగ్స్ ఇచ్చిన చోట విధుల్లో చేరాలని ఆదేశాలు జారీచేశారు. కొంత మం ది ఉన్నతాధికారులను కలిసి ప్రయత్నాలు చేసినా ససేమీరా అన్నారు. దీంతో డిప్యుటేషన్ కోసం ప్రయత్నించిన వారి నోట్లో పట్టి వెలక్కాయపడ్డట్లయ్యింది. చేసేదేంలేక పాత స్థానాల నుంచి రిలీవ్ అయ్యి, తాము బదిలీ అయిన స్థానా ల్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. గతంలో గ్రామ రెవెన్యూ అధికారులు (వీఆర్‌వో) సైతం డిప్యుటేషన్‌పై పలు స్థానాల్లో పాతుకుపోగా, అప్పటి కలెక్టర్ యోగితారాణా సైతం కఠినంగా వ్యవహరించి డిప్యుటేషన్లను రద్ధుచేసి, ఎక్కడి వారికక్కడ పోస్టింగ్స్ ఇచ్చారు. తాజా కలెక్టర్ మాణిక్‌రాజ్ డిప్యుటీ తాసీల్దార్లు, సీనియర్ అసిస్టెంట్లు/ మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల డిప్యుటేషన్లకు బ్రేక్‌లు వేయ డం గమనార్హం. మొత్తంగా ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించిన ఫలితంగా డిప్యుటేషన ఆశావాహులకు చెక్‌పడిందని రెవెన్యూ ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు.

224

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles