అన్నను చంపిన తమ్ముడు

Wed,October 9, 2019 09:17 AM

హైదరాబాద్: సొంత అన్ననే తమ్ముడు చంపిన సంఘటన సికింద్రాబాద్ పరిధిలోని గోపాలపురంలో చోటుచేసుకుంది. తమ్ముడు సాయికుమార్ బ్లేడుతో మెడ, పొట్ట భాగంలో దాడి చేయడంతో అన్న సంతోష్‌కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన సంతోష్‌ను కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సంతోష్ మృతిచెందాడు. మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. కుటుంబ కలహాలతోనే అన్నను హత్య చేశానని సాయికుమార్ వెల్లడించాడు. నిందితుడి సాయి కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

4292
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles