పురుగుల మందు తాగిన ఇద్దరు చిన్నారులు..

Wed,November 13, 2019 10:20 PM

సిద్దిపేట: ఇద్దరు చిన్నారులు పురుగుల మందు తాగిన ఘటన సిద్దిపేట జిల్లా, మద్దూరు మండలం, నర్సాయపల్లిలో చోటుచేసుకుంది. చిన్నారులు తుమ్మల భాస్కర్(12), బన్నీ(11) పురుగుల మందు తాగి, అపస్మారక స్థితికి చేరారు. విషయం గమనించిన వారి కుటుంబ సభ్యులు చేర్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, వారిలో ఒక చిన్నారి మృతి చెందగా, మరో చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. బతికున్న బాలుడిని మెరుగైన వైద్యం కోసం సిద్దిపేట ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, విచారణ చేపట్టారు. పురుగుల మందు అని తెలియక తాగుంటారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా, చిన్నారులు తెలియక తమ ప్రాణాల మీదకు తెచ్చుకున్నారని వారి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు.

882
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles