హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ దేవాలయంలో రౌడ్ గ్యాంగ్ వీరంగం సృష్టించింది. సమయం దాటడంతో టెంట్ ఖాళీ చేయాలని నిర్వాహకుడు కోరడంతో ఆవేశానికి లోనైన 30 మంది రౌడీలు టెంట్‌హౌస్ నిర్వాహకులను చితకబాదారు. వెంటబడి మరీ దారుణంగా కొట్టారు. బాధితులకు తీవ్రగాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు వెనక్కి తీసుకోవాలని బాధితులను రౌడీ గ్యాంగ్ బెదిరిస్తున్నట్లు సమాచారం.