రాజేంద్రనగర్‌లో వ్యక్తి దారుణ హత్య

Sun,November 17, 2019 06:34 AM

రంగారెడ్డి: జిల్లాలోని రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గడిచిన రాత్రి ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అర్థరాత్రి వేళ ఫిరోజ్ అనే వ్యక్తిని కొందరు దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

292
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles