హోటల్ యజమానికి జైలు

Wed,November 20, 2019 06:32 AM

హైదరాబాద్ : నిబంధనలకు విరుద్ధంగా అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి ఉంచుతున్న ఓ హోటల్ యజమానికి న్యాయస్థానం 8 రోజుల జైలు శిక్ష విధించిందని నగరంలోని హుమాయూన్‌నగర్ ఇన్‌స్పెక్టర్ కోరని సునీల్ తెలిపారు. బహదూర్‌పురాలో నివసించే మహ్మద్ జమీర్ హుస్సేన్‌కు మెహిదీపట్నంలో హసన్ పేరుతో హోటల్ ఉంది. యజమాని ఈ హోటల్‌ను అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా తెరిచి వ్యాపారం చేస్తున్నాడు. దీంతో ఇతనిపై 15 వరకు కేసులు నమోదయ్యాయి. పోలీసులు హోటల్ యజమానిని మంగళవారం 12వ స్పెషల్ ఎంఎం కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా కోర్టు అతడికి 8 రోజుల జైలు శిక్ష విధించిందని తెలిపారు.

916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles