హాస్పిటల్‌లో అగ్నిప్రమాదం.. చిన్నారి సజీవ దహనం

Mon,October 21, 2019 10:30 AM

హైదరాబాద్: పట్టణంలోని ఎల్ బీ నగర్‌లో గల షైన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌లోని 4వ అంతస్తులో ఐసీయూ వార్డులో ఈ ఘోర ప్రమాదం చోటు జరిగింది. ఐసీయూలో ఉన్న ఓ 5నెలల చిన్నారి అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు. మరో 5 మంది సంవత్సరం లోపు వయస్సున్న చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వేరే హాస్పిటల్‌కు తరలించినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద చిన్నారుల తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. వారిని ఆపడం ఎవరితరం కావడం లేదు.

1353
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles